8వ తారీఖు జనవరి 14. ఉదయం నుండి శ్రీశాంతి బాగానే ఉంది. శ్రీశాంతి ఎవరో కాదురా బుల్లోడా! మీ అమ్మ... మీ నాన్న ఆఫీసుకు బోయిండు. మీ అమ్మ నేను తీరి కూర్చుని కంప్యూటర్ల దొంగరాముడు సిన్మా చూడవట్టె. మస్తుగుంది సినిమా... దానికి తోడు మీ అమ్మ కామెంటరీ – క్రికెట్ కి కామెంటరీలా సినిమాకి మీ అమ్మ.
"జిక్కి పాటలు బాగున్నాయి" అంటనే సడెన్‌గా "అమ్మో అత్తయ్యా నాకు నొప్పులు... బాబో ఒళ్లంతా ఏదోలా వుంది" అంటా ఆగమాగం చేసె. వెంటనే మీ నాయ్నకి ఫోన్ కొట్టా. వెంటనే ఇంటికి పూడ్చు అని. ఈలోగా గబగబా గ్లూకోజ్ కలిపి మీ యమ్మకిచ్చా. రెండు గ్లాసులు తాగె. మీ నాయ్న తోలుకొచ్చేతలికి కొంచెం నిమ్మదించింది మీ యమ్మ.
"అమ్మా... మట్లపాలెం మాలక్ష్మి తల్లీ... తల్లీ బిడ్డా బాగోవలా అనుకొంటా నేను, అమ్మో అంటున్నా నవ్వుతోనే మీ యమ్మ ఆటో ఎక్కె. మీ నాయ్న స్కూటర్ పై వెంబడించె. సీదా రాగి హాస్పిటల్ డాక్టర్ సునీతమ్మ దగ్గరికి తోల్క పోయాం మీ యమ్మను.
ఆమె చూచీ చూడంగనే ఆపరేషన్ చెయ్యాల అనే. ఫిబ్రవరి 9 తేది పుట్టాల్సిన పిల్లగాడు... 8 - 1 - 2014 ఆపరేషన్. బ్లడ్ బాంక్ కి మీ నాయ్న పరుగులు. జనని బ్లడ్ బాంక్‌ల ఒక పాకెట్ దొరికె. ఈ లోగా మీ రవి మావ, రెడ్డి బాబాయ్ కూడా వచ్చి మీ నాయ్నకి తోడయ్యారు. జయబాబాయ్ కూడా నీవు పుట్టేసరికి వచ్చేశాడు. మీ అమ్మ మీ నాయ్నని పట్టుకొని ఏడ్చింది. నేను ధైర్యం చెప్పినా... ఊకో... నా ఆయుస్సు కూడా నీవే పోసుకో అని ధైర్యం చెప్పినా... డాక్టరమ్మ వచ్చి తొందర తొందరగా ఆపరేషన్ థియేటర్ కి మీ యమ్మను తీస్క బోయింది. ఏటయితాదో ఏమో భగమంతుడా నీవే రక్ష అనుకుంటా నేను, మీ నాయ్న, జయ బాబాయ్, రెడ్డి బాబాయ్, రవి మావయ్య అందరం వెయిటింగ్.
రెడ్డి బాబాయ్ కేక... అదిగో పిల్లాడు అంటూ... మూడు తలుపుల లోపల పుట్టిన నీ ఏడుపు. మా అందరకు వినిపించింది. నిన్ను స్ట్రెచర్ పై తోల్క వచ్చినారు నర్సమ్మలు. అందరం నీవు ఆడా, మగా అని కూడా చూస్కోలేదు. ముందుగాలే నేను, మీ అమ్మ, నాయ్న మువురం మగబిడ్డ లానే ఊలాడుకుంటుండె. అట్లనే నీవు బుల్లోడయినావు. నేను పుట్టాను అనే గొప్పబోయె బుల్లోడా నీ వెనకమాల యింత వెత జరిగె ఎరికెనా...
తెలంగాణ బుల్లోడికి ముద్దులతో...

నాయనమ్మ
(సశేషం)
No comments:
Post a Comment