Sunday, 6 April 2025

Manga & Me – Part 1

Manga originated in Japan. It is read from right to left. It is nicer than comics, well at least to me. The Manga I’ve read are One Piece, My Hero Academia, Bakuman and Attack on Titan. There are many Mangas in the world that I haven’t read and I am planning to read them all. May be not all but the most interesting ones. One Piece was first a manga and then an Anime and next a movie. One Piece is super duperishly colossally a famous manga. Seriously super famous. People love that manga, so do I. It’s in my top 3 favorites. One Piece is number 2. My Hero Academia is number 1. And Diary of a Wimpy Kid is number 3. Ooops, Diary of a Wimpy Kid is not a manga, but a comic. But let’s forget about that anyways. 

Manga is read right to left. And comics are read from left to right. And at first, I am confused with this, and read them the wrong way. This has happened sooooooooooo many times. I bet I read some 4 to 5 books like that, and then I wonder, ‘Hmmm, why do I feel like I read them the wrong way?’. Anyways, manga art styles can be either be bad or good. It’s nice to look and them and try to draw them. I copied so many manga pictures, and now I am like—from the scale of 1 to 10—I am at level 3. First, I was at the level zero. But because I copied all the book, I found I became level 3. Which is a super-duper big deal. 

My favorite character in manga is from My Hero Academia. His name is Deku, but that’s his nickname. His real name is Izuku Midoriya. He is the protagonist of the entire book series. His goal is to become the number one hero. But he can’t become a hero because he has no powers. The powers originated first in some country. And a bioluminescent baby is born. He gives light from the skin. And superpowers came from all around the planet. And superpowers are called quirks. And fantasy became reality. And the number one hero of them all is All Might. And Midoriya was chosen by All might to become his successor. That’s all. 

And if you want to know more about My Hero Academia, buy it yourself. I am not gonna tell the story all day. I am gonna tell the rest of it later, wait for part 2. Leave me alone. Geez! 


Saturday, 22 March 2025

5th class over in Don Bosco Middle School

The first day in Don Bosco 5th class: I joined in this section called Violets. The first day was like terrible. I sat alone, nobody talked to me. It was boring. Everybody avoided me like the plague. The second day was better. I made a new friend called Sreeman. He was thinking he was HANUMAN. He could wind up like this in the future. 


New friends other than Sreeman  are - Chakresh, Nayesha, Ayesha, Vardhan, Ashwin, Darshini, Rishik, etc. These were my best friends. At the end of the year, Sreeman pranked me that he was leaving the school, I was sad. When I realized that this was a prank that Sreeman created, this had happened: 


Other Fights: Sreeman and I fight about him being Hanuman. I tell him over and over that he is not Hanuman, just a regular boy. Ridiculous right! But he says, ‘ha ha ha! You brainless idiot. You just couldn’t admit that I am God, and you are jealous that I am’. I got pretty mad, I didn’t want to scold him, or fight with him, and that I decided I had to convince him that he is a regular boy. But for now, I will leave him alone. At least till six class. 

Plus, we also have this problem with the girls. They keep picking on Sreeman and me and Chakresh. By girls I mean just three people. Jasmitha, Sourya, Joan. We always have to run away from them and shield ourselves. We could destroy them, except for the fact that we should not hit girls. I wanted to be a gentlemanish guy. So, a few times we just push them away and ran and hid in the crowd. What I mean by crowd is- there are three periods which involves breaks. First break period, Lunch break, and Second break period. In lunch break you have to stay in the class room and eat. But first break and second break you can go out into this humongously huge ground and runaround and play games. So that’s the crowd where Sreeman and I hid from the girls. When the girls tracked us down, we separated our ways. So that each one of us can deal with only one girl and not three. And after the bell rang, everybody goes into the entrance to go back to the classes and it’s like a tornado inside the building, and when you  get sucked in, it’s like a blackhole of hands and feet and stinky smelly bodies and shouting and screaming excitedly to see who can get into the class first. So what Sreeman, Chakresh and I do is stay late. Because, we don’t want to get murdered by the clamping feet of formal shoes stomping your face and turning you into some mushy liquidy facey thing. Which makes you looks no longer a human but more like gooey disgusting coackrochish fungusish gorssish thing. By the way, I exaggerated. 

New things learned: I learned nothing except math english social science etc etc etc… But the biggest thing I learned this year is that Sreeman is SUPER S—E—N—S—I—T—I—V—E. 


Thursday, 20 March 2025

What I feel about Diary of a Wimpy Kid

This is about the book Diary of a Wimpy Kid. It’s mostly about this kid names Greg Heffly and his family. Greg and his family always get into trouble. It doesn’t help that Greg’s older brother Rodrick is a bit of a juvenile delinquent, and dreams to become a rock star. Rodrick’s band mates are Bill, Eric and somebody else I don’t remember now. Manny is Greg’s younger brother. And he is the main problem. He always makes small problems that irritates the family and ruins their mood. Greg’s mother and father names are Susan Heffly and Frank Heffly. Greg’s one and only best friend is Rowley Jefferson. And Greg has no enemies but he does have a few problems with Fregly. He is bit of a freak. So, Greg Heffly avoids him as much as possible. Greg’s life in middle school isn’t so great. Greg is seated next to a bunch of morons. And he always worries about not being popular and wants to become more popular. He always worries about what other people think of him. And Albert Sandy is a kid at lunch who is always blabbering lies and everyone at his table believes every word he says. Albert Sandy won’t appear much in the book. He appears in the book probably 5 or 6 times in the entire series of the Diary of a Wimpy kid book. Rodrick always practices his band in the basement which doesn’t make his family happy. Rodrick once toilet-papered an elderly woman’s house because she called the cops for his band rehearsal being too loud. 

How Feel About It... 

I like the books a lot. I read each book 5 - 6 times over and over. Why I like it so much is because seeing his family get into trouble is hilarious. I feel like that Greg’s family will get into problems that are very rare to happen to any family. But it’s not like they are fighting super villains, they are encountering normal problems but they try to solve in such a way that makes it seem unbelievably rare and stupid, in a good way. 

END 


From now on... it's Siva Raghava Himself!

This is the day I handover this blog to my son. 

From now on, it's his writing that will appear in this blog.

He will write about his books, art, friends, pets, parents... whatever topic that comes into his mind. 

MEHER SIVA RAGHAVA... is the author of this blog  

Welcome chin chin! 


Wednesday, 13 November 2024

ఎవడు వీడు

పుట్టినపుడు చేయంతలేడు.. ఇప్పుడో భుజాలకు అందుతూ ఏదో ప్రపంచ విజేతగా నాతో వాదులాడతాడు.

వీడితో లోకం మరింత బాధ్యతగా మారిపోయింది. అమ్మదనం కన్నా గొప్పది మరేదో వచ్చి చేరింది. నాన్నతనం కూడా అయుంటుంది. నీ ప్రతి వాదనా నాకు నచ్చుతుంది. నిర్మలం నీచూపు. పొగిడితే దిష్టి. నా బంగారు చిన్న స్కూలు కష్టాలు అయిపోయి హైస్కూల్ వరకూ వచ్చాడు. నెమ్మదిగా నడిచే నడకే అందులోనూ నీకంటూ ఓ స్టైల్ ఉంది. 11 ఏళ్ళు పూర్తి కాగానే నువ్వు ఓ హీరోగా నిలవాని చేసే ప్రయత్నం బావుంది. నీ సంగీతం, ఆర్ట్, వీడియోలు, నువ్వు ఇచ్చే ప్రసంగాలు ఎప్పుడూ నా పాల గుండెలను ఆప్యాయంగా తడుముకునేలా చేస్తాయి. మరకలతో నిండిన మనుషుల మధ్య ఈ తల్లి జీవితంలో నువ్వు నా కాంతిపుంజానివి. నాన్నా ఒకటి మాత్రం కోరుకుంటాను. మీ నాన్నలా నీతిగా,నిజాయితీగా నిలబడు, ఆడదాన్ని గౌరవంగా చూడు. పట్టుదల వదలకు,అప్పుడు ఎప్పటికీ విజయం నీ వాకిలి దాటిపోదు. చదువు అందరూ చదువుతారు, గెలుస్తారు కానీ అందులో నిజాయితీ ఉండకపోతే నీ గెలుపుకు అర్ధం ఉండదు. బంగారు తల్లి నీ పుట్టుక బెంగతో మొదలైంది.. నీ ఎదుగుదల ఆశతో చిగురులు వేస్తుంది. ముందు ముందు రోజులు ఎవరెస్ట్ అంత గౌరవమైన జీవనం,భవిష్యత్తు నీది కావాలని ఆశించే మీ అమ్మా నాన్నా❤️ నిండా నూరేళ్లు నాతండ్రికి💐

Friday, 8 September 2023

మా ముదుపుచ్చి.. తింగరబుచ్చి అన్నీ నువ్వే..

 నీ చిలిపితనం గురించి ఎంత చెప్పినా తక్కువే రా.. ఈమధ్య మాటలు బాగా నేర్చావ్.. ఒక్కోసారి కోపగించుకుంటావ్ కూడా.. నేను విసుక్కున్నా కూడా గమ్మునుంటావ్.. మరోసారి తిరగబడతావ్.. నువ్వు ఏది చేసినా అమ్మకు నాన్నకు ముద్దే.. నీతో సమయం, చేసే అల్లరి అన్నీ బావుంటాయ్. అమ్మగా కన్నా నీ దోస్తీని ఎక్కువగా ఇష్టపడతాను.


ఇద్దరం నాన్నకు తెలీకుండా చేసే పనుల్లో ఎంత రహస్యాన్ని మెంటెన్ చేస్తామంటే.. నువ్వు 007లా నాతో పాటు కూడా వచ్చేస్తావ్.. నాన్నగాడేమో  పాపం నిన్ను ఏం తెలీనోడివి అనుకుంటాడు కానీ.. ముది పుచ్చు అని తెలుసుకోడు.


ఎప్పుడో మన రహస్యాలు బయటపడిపోయి నిన్నూ నన్నూ తన్నినా ఆశ్చర్యం లేదు. చెప్పడం మరిచిపోయాను. నీకు తెలుగు నేర్పులేదని, నేర్పించలేకపోతున్నానని మీ నాన్న నన్ను దెప్పుతున్నాడు. నువ్వు చూస్తే ఇంకా తడుముకుంటూనే ఉంటావ్. నీ మాటలు తెలుగు కోసం పడే పాట్లు అవీ బావుంటాయ్.. చూడు ఎంత అందంగా మాట్లాడుతున్నావో..


నాకు ఇల్లుతుడిచి పెడుతున్నావ్ రోయ్.. ఈమధ్య నాకు నస ఎక్కువైందని చమత్కారాలు, చల్లోక్తులు విసురుతున్నావ్.. నా డ్రస్ లకు నా డాన్స్ కు వంకలు పెడుతున్నావ్... ఇవన్నీ దాటేసి మా ప్రేమ కథ గురించి తెగ ఆరాలు తీస్తున్నావ్.. పెద్దయ్యాకా అని నేను అనగానే బాబాయ్ ఉద్యోగం చేస్తాను. నీకు పెద్దగా బంగారం చీరలు కొంటాలే అని వాగ్దానాలు చేసేస్తావ్.. నాది, నాన్నది ప్రపంచం అంతా నీలోనే దాగుందని తెలుసుకుంటే చాలురా.. నువ్వు నీలా అందంగా, హృందాగా పెరిగితే అది చాలు. 


ఈ అమ్మ జీవితావికి చాలా మోసి అలసిపోయింది. నీ జీవితపు వెలుగులు చూసి తనువు చాలిస్తే చాలు. ఆ పరమేశ్వరుణ్ణి అదే కోరుకునేది. నాన్న, నువ్వు ఇద్దరే నాకు రెండు కళ్ళు. నాలుగో తరగతి తర్వాత నిన్ను స్కూల్ మార్పించాలనే ఆలోచన ఉంది. ఏమో ఎప్పటి మాటది. ప్రస్తుతం నీ నెత్తిన చాలా బరువే ఉంది. ఎలా దింపుకుంటావో ఏమో.. నాలుగో తరగతి తర్వాత ఆలోచిస్తాం ఏం చేయాలన్నది. 



Thursday, 7 September 2023

కొత్త కళలు...

 

 

 

చిన్నమ్మా.. నీకు ఎనిమిదేళ్ళు దాటుతున్నాయి.. నీ ఆలోచనలు, నీ వ్యాపకాలను నువ్వు నిర్మించుకోవడం బావుంది. నీ ప్రతి అడుగూ మాకు నచ్చినట్టుగా వేయాలని అస్సలు అనుకోవు. నీతో కలిసి గడిపే సమయం మా ఇద్దరికీ అదే మీ నాన్నకు, నాకు చాలా అపురూపం. మీనాన్నతో చెస్ బాగా ఆడతావు. మంచి మెళకువలు నాన్న నేర్పుతున్నాడు. నువ్వు చదివే ఆ ఇంగ్లీష్ పుస్తకాల గురించి మీనాన్న తెగ తాపత్రయపడుతూ కొనిపెడతాడు. నీకు పుస్తకాలు చదవడం చాలా ఇష్టం దాదాపు చాలా పుస్తకాలు ఈ సంవత్సరంలో చదివేసావు. చక్కగా చదువుతూ ఎంజాయ్ చేయడం నచ్చుతుంది నాకు. అలా అలా నాన్నలా మంచి సాహిత్యం చదవగలిగే సత్తాను సంపాదించాలి.

 

నిన్ను సంగీతంలో పెడుతున్నానని చెప్పినప్పుడు నువ్వు నామీద చాలా అలిగావు. కోపగించుకున్నావు. వద్దన్నావు. వెళ్ళనన్నావు. ఇప్పుడు అలా అనవుకానీ ఎక్కడో నామీద కోపం ఉందని తెలుస్తుంది. నిజానికి చిన్నతనంలో నేను నేర్చుకోవాలన్నా నేర్చుకునే పరిస్థితులు లేవు. నీకు సంగీతం అందుకోసమనే కాదు. నీ ఆరోగ్యానికి సహకరిస్తుందని కూడా, అలాగే నీకు మరో కళ పరిచయం అయినట్టు ఉంటుందని కూడా ఈ నిర్ణయం తీసుకున్నాను. మీనాన్న కూడా సరేనన్నాడు. చాలా సంతోషంగా జూలై నెల నిన్ను మీ గురువుగారు ఉమగారికి అప్పగించాను. జూలై 12, 2023 ఇది నీకు కొత్తలోకాన్ని పరిచయం చేసిన రోజు. నేను కూడా నీతో పాటు నా చిన్ననాటి కల నాట్యం వైపు వెళ్ళాను. సరిగ్గా నీకూ నాకు ఒకరోజు తేడా అంతే.. కానీ నీతో కలిసి పోటీ పడి మరీ ఇలా కళ నేర్చుకోవడం నేను చాలా సంతోషించే విషయాల్లో ఒకటి. చాలా బావుంటుంది నీతో గడిచే సమయం. 


నీలా కొత్తగా ప్రపంచాన్ని తెలుసుకునే పిల్లాడితో పసి మొగ్గతో కలిసి బ్రతకడం నిజంగా నా అదృష్టం అనుకుంటాను. చాలా సంతోషాన్ని మూటగట్టుకుంటాను. ఇంతక మునుపు నీతో దగ్గరగా ఉంటే నాకు దూరంగా పోతావేమోననే బాధ ఎక్కడో ఉండేది. అది భయంగా మారి చాలా రోజులు నిన్ను మీనాన్నకే అప్పగించాను. కానీ ఈమధ్యనే నీతో సమయం గడుపుతుంటే బావుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎంజాయ్ చేస్తున్నాను. 


ఇక నీ సంగీతం క్లాస్ చాలా చక్కగా జరుగుతుంది. నీకు ఫీజ్ కట్టలేనేమో అనుకున్నాను. ఆ పరమేశ్వరుడు ఆ బాధలేకుండా చేసాడు. నీతో సరిగమలు పాడుతుంటే నా ఆనందం ఏమని చెప్పను. నిండుగా ఇలా చక్కగా నువ్వు ఎదిగి నీ కలల జీవితాన్ని అందుకోవాలి. గొప్ప వ్యక్తిగా నీకు నచ్చిన దారిలో పయనించాలి. మళ్ళీ చెబుతున్నాను నువ్వు మంచి వ్యక్తిగా ఎదగాలి, నీకు తోడుగా నాన్న, నేను ఎప్పుడూ ఉంటాం. మేమే నీకు పిల్లర్స్. చక్కగా చదువుకుంటూ నేను బలవంతంగా అంటించానని ఫీలవుతున్న సంగీతంలో కూడా మంచిగా రాణించాలి. సరేనా.. గుడ్ లక్ నాన్నా... లవ్వూ..

Sunday, 11 June 2023

Mnemonic Note: చిన్నోడి వేసవి సెలవులు 2023

నేను Seinfeld రెండోసారి చూద్దామని మొదలుపెట్టి మూడో సీజను దాకా వచ్చేసరికి చిన్నోడికి ఒంటిపూట బళ్లు మొదలయ్యాయి. ఇంక వాడూ నాతో చూట్టం మొదలుపెట్టాడు. అలా ఈ వేసవి సెలవుల్లో రోజుకి రెండు మూడు ఎపిసోడ్లు చొప్పున మిగతా ఏడు సీజన్లూ ఇద్దరం కలిసి చూసేశాం. పెద్దాళ్ల షో అయినా, అందులోని సిల్లీనెస్‌ ని వాడూ చాలా ఎంజాయ్ చేశాడు. వాడికి నాకూ కూడా Kramer కేరెక్టరు అంటేనే ఇష్టం. ఒకటి రెండు ఎపిసోడ్లు వాడి వయసుకి నప్పవనిపించినవి స్కిప్ చేశాను. ఇంకా ఎండలు ముదరని కొన్నాళ్లు మటుకు కొన్ని రోజులు పొద్దుటిపూట్ల ఊరకే వీధుల్లో తిరిగాం. ఎండలు ముదిరి ఇంట్లోకే confine అయ్యాకా ఇక అక్కడ కాలక్షేపానికి వేరేవి వెతుక్కోవాల్సి వచ్చింది. నేను చూద్దామనుకునే సినిమాలూ, చదవాలనుకునే పుస్తకాలూ పూర్తిగా పక్కన పెట్టేశాను. ఇద్దరం చూడగలిగేవీ చదవగలిగేవీ... వాటి జోలికే వెళ్దాం అని నిశ్చయించుకున్నాను. Seinfeld ఒక్క విషయంలో మాత్రమే నా స్థాయికి వాడ్ని లాక్కొచ్చాను. ఇక మిగతావన్నీ వాడి లెవెల్‍కి నేను వెళ్ళాల్సి వచ్చినవే. ఈ వేసవి సెలవుల్లో వాడికి Anime shows, Manga books పరిచయం చేద్దాం అనుకున్నాను. మామూలుగా నెట్‌ఫ్లిక్స్ ఎకౌంట్ వాడికోసమే మెయిన్‌టైన్ చేస్తుంటాను. కానీ అందులో అమెరికన్ షోస్ అన్నీ ఒకే పాటర్న్‌లో, మరీ పొలిటికల్లీ కరెక్టడ్‌గా, అన్నింటినీ తేలిగ్గా తీసిపారేసే టిపికల్ అమెరికన్ హ్యూమరుతో వెళ్తున్నాయనిపించింది. అందుకే Anime, Manga వాడికి పరిచయం చేద్దామనిపించింది. ఎప్పుడో 80'sలో మొదలై ఇప్పటికీ కొనసాగుతున్న Dragon Ball సిరీసులు మొత్తం డౌన్లోడ్ చేసి చూపించాను. నేను కలిసి అన్ని ఎపిసోడులూ చూడలేదు గానీ, నేను మిస్సయిన ఎపిసోడ్లలో కథ ఏమవుతుందో నెట్‌లో చదివి నన్నునేను అప్డేట్ చేసుకున్నాను. ఎందుకంటే, వాడితో మాట్లాడటానికి కామన్ టాపిక్స్ కోసం. ఆ విధంగా Goku అనే ఆధునిక పురుషోత్తముడు ఇద్దరికీ హాట్ టాపిక్ అయ్యాడు. గత ఏడాది నేను సాధించిన గొప్ప విజయాల్లో చిన్నోడికి ఇంగ్లీషు చదవటాన్ని వాళ్లు టీచర్లు నేర్పించలేనిది నేనే ఒంటిచేత్తో నేర్పగలగటం ఒకటి. Diary of a Wimpy Kid మొదటి రెండు వాల్యూములు నేను చదివి వినిపించినా, మూడో వాల్యూము నుంచి ఏడో వాల్యూము దాకా వాడే చదువుకున్నాడు. ఆ ఇన్‍స్పిరేషన్‌తో డైరీ కూడా రాయటం మొదలుపెట్టాడు. దానికి కొనసాగింపుగా ఈ వేసవి సెలవుల్లో One Piece మంగా బుక్స్ కొన్నాను. మూడు వాల్యూములు ఇలా అమెజాన్ నుంచి పుస్తకం రాగానే అలా గంటలో చదివేశాడు. తర్వాతి పుస్తకం కొనటం లేటయితే, ఉన్నదాన్నే మళ్ళీ మళ్ళీ చదువుకున్నాడు. గత వేసవి సెలవుల్లో ఇంగ్లీషు చదవటం నేర్పినట్టే ఈ సెలవుల్లో తెలుగు నేర్పుదాం అని కొన్ని క్లాసులు తీసుకున్నాను కానీ, కంటిన్యువ‌స్‌గా చెప్పటం కానీ నా వల్ల కాలేదు. కలిసి చూసిన సినిమాలు: Ratatoullie, Minnal Murali, The Emperor's New Groove. మిన్నల్ మురళి వాడికి బాగా నచ్చింది. అప్పుడప్పుడూ కలిసి బొమ్మలు కూడా వేశాం. వాడి బొమ్మలు చాలా మెరుగయ్యాయి. అలాగే ఈ నెలతో Chess.com అకౌంటుకి డబ్బులు కట్టాను. ఇద్దరం కలిసి ఆడటం, లేదా ఆ అకౌంటులోకి వెళ్లి అపరిచితులతోనో, చెస్ bots తోనో ఆడటం... అదో కాలక్షేపం. నన్ను తొందరలోనే మించిపోయాడు. అంటే పెద్ద పాయింట్లేమీ కాదు. నాలుగొందలు దాటాడు ఇప్పుడే. ఇలా చెస్ ఆడటం, లేదా యూట్యూబులోకి వెళ్లి Magnus Carlsen, Hikaru, Gotham chess... వీళ్లవో, వీళ్ల గురించినవో చెస్ వీడియోలు చూడటం... అదో పెద్ద కాలక్షేపం. ఇంకోటి, వాడిలొ హ్యూమరు, నన్ను నవ్వించగలగటం నేను కొత్తగా గమనిస్తున్న విషయాలు. అలా మొత్తానికి ఈ వేసవి సెలవులు పొద్దస్తమానం బాగా కలిసి గడిపి ఇవాళ మొదటి రోజు స్కూల్లో దింపాను. నా నైట్ డ్యూటీస్ వల్ల మళ్లీ ఏడాదికి గానీ ఇలా దొరకడు.




Sunday, 21 May 2023

అమ్మ చిరునామా నువ్వు..

చిన్న మొలకని జాగ్రత్తగా చూసుకోమని నానీ హెచ్చరించిన ప్రతిసారీ నాకు లోపల ఏం అనిపిస్తుందో తెలుసా.. నీవు నాకు గొప్ప కొడుకులా కన్నా నన్ను అమ్మతనానికి దగ్గర చేసి, చాలా బెంగలనుంచి బయటపడేసిన చిట్టి కృష్ణుడికి నేను ప్రత్యేకించి చేసేదేం ఉంటుంది అని అనిపిస్తుంది. భగవంతుడు నా నుంచి చాలా లాగేసుకుని నిన్ను వాటిని భర్తీ చేసేందుకు ఇచ్చాడేమో అనిపిస్తుంది. నీ ప్రతి కదలికా అందంగా అనిపిస్తుంది. నీ అల్లరి, నీ మౌనం నాకు చుట్టూ చేరి ఆనందంలో తేలిపోయేలా చేస్తాయి. 


ఎన్నో దిగుళ్ళకు నీ చిరునవ్వు సమాధానం. నాలో చాలా దిగులుందని మరిచిపోయేది నిన్ను చూసుకునే.. నువ్వు ఎదిగి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడిగలిగేంత వరకూ నీకు చేయూతనిచ్చే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని ఆశిస్తున్నాను. చాలారోజులు నీ ఆరోగ్యం గురించి దిగులుండేది. దానినీ దాటావేయో.. నువ్వు చదువులో చురుకు కాదని అనుకున్నంత సేపు లేదు.. నీలోకం అంతా చదువే ఉందిప్పుడు.  అమ్మగా లోపల చాలా గర్వపడుతున్నా దానిని పైకి తెలీనీయను. నిన్ను కసురుకున్నప్పుడు నీకు కోపం వచ్చి ఈ అమ్మను వద్దంటావు చూడు. బాధేస్తుంది. అంత కఠినమైన మాటలు నీ నోటితో అన్నప్పుడు.. నిన్నుచూసి పొంగిపోయిన ప్రతిసారీ లోపల మళ్ళీ భయం కమ్ముకుంటుంది. ఇదేంటి ఇలా నిన్ను పొగిడేసాను. ముద్దాడాను. మురిసిపోయానని అలజడి మొదలవుతుంది. దిష్టి తగులుతుందేమోనని మళ్ళీ నిన్ను కోప్పడతాను. 


మీ నానీ అంటుంది కదా నువ్వు పెద్దవాడవై, ఎదిగి గొప్ప ఆఫీసర్ వి కావాలని.. ఆమె కోరిక. నాకు అంతకన్నా గొప్ప కోరిక ఉంది. నా బాకీలన్నీ నువ్వే తీర్చాలి. నేను సమాధానం చెప్పాలనుకునే వాటికి నా అవమానాలకి అన్నింటికీ నువ్వు జవాబుదారీవని నమ్ముతాను. నిన్ను నిలబెట్టిన రోజున నేను పూర్తి విజయం సాధించినట్టు. నీ ఆలనా పాలనా చాలా శ్రద్ధగా చూసుకోవాలనిపిస్తుంది. ఈమధ్యకాలంలో నిన్ను సరిగా చూసుకోవడంలేదేమోనని లోపల దిగులు కమ్ముకుంటుంది. మళ్ళీ నేనే తమాయించుకుంటాను. నీకు నేను పండన్నా కొనితేగలుగుతున్నానంటే అది ఈమాత్రం కష్టం పడుతున్నందువల్లనే. నన్ను మనిషిగా నిలిపేది ఇదే. లేదంటే నేనూ మరొకరిపై ఆధారపడి బతకాల్సిందే. నీకు పెన్సిల్ కొని ఇవ్వగలిగే అమ్మ ఉందనుకో.. అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా నువ్వు నామాట విని డైరీ రాస్తున్నావు చూడు. అది ఇంకా ఆనందం నాకు. నీ డైరీకి రాము అనే పేరు పెట్టడం ఇంకా ముద్దు.  అందులో నువ్వు ఏం రాసినా నాకు తెలియకపోయినా మురిపంగా ఉంటుంది. 


చదవడం రాదన్నంత సేపు లేకుండా నువ్వు పుస్తకాలు చదివేస్తుంటే నాకు తీన్మార్ ఆడినంత ఆనందంగా ఉంటుంది. కాస్త గర్వం కూడా.. ఇక నీ బొమ్మలో నాకు చాలా ఇష్టం. వాటితో నువ్వు ఏదోరోజు గొప్పవాడిగా గుర్తింపు పొందుతావేమోనని అనిపిస్తుంది. నీ ప్రతి ఆలోచనలో నేను ఉండకపోయినా నీ ప్రతి అడుగులో వెనుక ఉండాలనేది







అమ్మగా నా కోరిక. బావుండు నా చిట్టి తండ్రి. గొప్పగా బ్రతుకు. ఇప్పుడు కూడా ఈమాటలు చెప్పకపోదును. ఉదయం బుజ్జిగా ముడుచుకుని నువ్వు పడుకున్నప్పుడు నా కడుపులో చిన్నగా బాధ మొదలైంది. నిన్ను ఎన్ని ఇబ్బందుల మధ్య ఈ భూమి మీదకు తెచ్చానో కదా అని.. దినదినం నీ ఎదుగుదలను చూడగలిగే అవకాశం, ఆనందం ఆ పరమేశ్వరుడు ఇచ్చినందుకు సంతోషంగా నమస్కరిస్తూ.. అమ్మ..

Tuesday, 28 June 2022

picking you up at school on a rainy day

 వర్షం వల్ల స్కూలు గేటు ముందు జనం మరీ ఎక్కువమంది ఉంటారని తెలుసు. కాస్త ఆలస్యంగా వెళ్దామని అనుకున్నాను. కొత్త ఇంటిలోకి వెలుతురు సరిగా రాదు. పగలు కూడా లైట్లేయాలి. బైట బళ్లు పార్కింగ్ చేసే చోట కూడా అంతే. ఇవాళ మబ్బుబట్టి చినుకులు పడుతుంటే ఇంకా మరీ చీకటిగా ఉంది. కాసేపు దోమల్ బాట్ పుచ్చుకుని బైట బళ్ళ దగ్గర దోమల్ని కొట్టాను. పట పటమని మెరుస్తూ బాట్ పేలటం బాగుంటుంది. అది పట్టుకుని కాసేపు మినీ Thor లాగా ఫీలయ్యి, మొత్తానికి పది నిమిషాలు ఆలస్యంగా బయల్దేరి వెళ్లాను. అయినా సరే స్కూలు గేటు ముందు జనం కిటకిటలాడిపోతున్నారు. చినుకులు ఎక్కడైనా బావుంటాయి కానీ, బట్టతల మీద బాగోవు. హెల్మెట్ తీయకుండానే ఆ పేరెంట్స్ గుంపులోకి దూరి, అక్కడ మైకుపట్టుకుని పిల్లల్ని పిలుస్తున్న టీచరుకి వినపడేలా, అలవాటులేనంత గట్టిగా నీ పేరు అరిచి చెప్పి, మొత్తానికి నిన్ను బైటకి తీసుకువచ్చాను. You looked tired. And happy. అక్కడున్న రద్దీ వల్ల బండి దూరంగా పార్క్ చేశాను. అక్కడిదాకా ఇద్దరం నడిచి వెళ్తుండగా అప్పటికప్పుడు అబద్ధం చెప్దామనిపించింది. ఇవాళ బండి తేలేదని, మనమిద్దరం నడిచే ఇంటికి వెళ్లాలని చెప్పాను. నువ్వు ఘోరంగా రకరకాలుగా నన్ను తిడుతుండగానే, మనం బండి దగ్గరకి వచ్చాం. నేను దాన్ని చూసి ఆశ్చర్యపోయినట్టు బిల్డప్ ఇచ్చి- "అరె ఈ బండి ఎంత మంచిదిరా.. సీక్రెట్ గా నన్ను ఫాలో అయి ఇక్కడిదాకా ఒచ్చేసిందీ" అన్నాను. నువ్వు వెంటనే జోక్ అందిపుచ్చుకొని- "ఎంత బుజ్జిముండ" అని దాన్ని హెడ్ లైట్ దగ్గర పట్టుకుని ముద్దు చేశావు. బండి డిక్కీ తీసి లోపల నీ కేరేజీ పెడుతుంటే అవినాష్ గురించి చెప్పావు. ఈమధ్య వాడు నీకు స్కూల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాడని, వాడు కనపడ్డం నీకు నచ్చటం లేదని చెప్పుకొచ్చావు. I didn't see any basic human reasoing in it, but I liked how you put it. మీరిద్దరూ సింక్ దగ్గర ఒకరి మీద ఒకరు నీళ్ళు చల్లుకున్నారట. టీచర్ ఇద్దర్నీ మోకాళ్ల మీద నిలబెట్టిందట. నువ్వు చెప్తున్నంత సేపూ నేను ఈ అవినాష్ గాడ్ని అశుతోష్ తో కన్ఫ్యూజ్ అయ్యాను. టీచర్ కొట్టకుండానే 'కొట్టొద్దు టీచర్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్' అని బాడీ మెలికలు తిప్పేసి మరీ ఓవరేక్షన్ చేసే అశుతోష్. నా జెర్కిన్ నీకు తొడిగి, నా హెల్మెట్ నీకు పెట్టాక, బయల్దేరాం. నువ్వు హెల్మెట్ గ్లాస్ మూసుకున్నావు. అందులోంచి మాట్లాడుతుంటే నీ మాటలు స్పష్టంగా వినపడటం లేదు. "ఆ...ఊ" అంటున్నాను. స్కూలు దగ్గరలో ఏదో బిల్డింగ్ కూలగొడుతున్నారు. నీకు చూపిద్దామని ఆపాను. ఆ క్రేన్ అంచుకి ఒక పెద్ద ఇనుప పిడికిలి ఉన్నట్టు ఉంది. It kept punching up the walls like a WWE wrestler. ఇద్దరం కాసేపు ఆగి చూసి బయల్దేరాం. నువ్వు లాంగ్ రూటులో వెళ్దామన్నావు. ఈ వర్షాన్నీ ఈ వాతావరణాన్నీ హెల్మెట్ గ్లాస్ లోంచి చూట్టం నీకు నచ్చిందనుకుంటా. కానీ ఇక్కడ నా బట్టతల మీద చినుకులు.. చిరాకు దొబ్బుతోంది. రోజూ వెళ్ళే రూటులోనే తీసుకొచ్చాను. నువ్వు వెనక నుంచి చేతులు ముందుకుతెచ్చి వాటిని నా పొట్ట మీద కలిపి రెండు చేతులూ వేళ్ళతో మెలేశావు. ఒక స్పీడ్ బ్రేకర్ మీంచి బండి గెంతినప్పుడు అప్పటికే వర్షానికి తడిసిన నీ చేతులు ఒకదాంట్లోంచి ఒకటి జారిపోయి భయపడ్డావు. ఏం మాట్లాడుకున్నాం? I guess we talked about people, how we hated them today for being all over the place. రోడ్డు మీద అక్కడక్కడా విరిగిన తురాయి కొమ్మలు. పళ్ళ మార్కెట్లో నేరేడుపళ్లు చినుకుల్తో మెరవటం చూశాను. ప్రపంచంలోని పర్పుల్ రంగంతా వాటి నుంచే వచ్చిందనిపింది. మధ్యలో గుర్తొచ్చింది- నువ్వు నిన్న 'Behka Mai Behka' పాటని ఇష్టంగా విన్నావని. I tried to hum. You told me to shut up. So I did. మధ్యలో ఒక వేప చెట్టు బాగా లేత అకులతో ఉంది. ఎంత లేత అంటే అస్సలు ముదురాకులే లేవనిపించేట్టు. బండి స్లో చేసి చూపించాను. You seemed to be as surprised and as happy to see it as i did. More than me infact. మలుపులు తిరిగి ఇంటికొచ్చేశాం. గేటు దగ్గర కూడా బురద బురద. గేటు బైటకి తీయాలో లోపలికి తీయాలో నీకు ఎప్పుడూ కన్ఫ్యూజనే. ఇంట్లోపలికి వెళ్లాకా కూడా నువ్వు ఆ పెద్ద హెల్మెట్టూ, నీకు పాదాల దాకా వచ్చే జెర్కిన్నూ తీయకుండా, బుల్లి ఏలియన్ లాగా కాసేపు గెంతావు. అద్దం ముందు ముడ్డూపుతూ డాన్స్. ఇంట్లో తడి చేస్తున్నావని బలవంతంగా విప్పించాను. తర్వాత స్పార్కోని చేతిలోకి తీసుకుని కాసేపు ఆడించటం మొదలుపెట్టావు. నేను కూడా తల తుడుచుకుని, settled back into the dry cosy land of home.

Tuesday, 31 May 2022

చిన్నోడికి పెద్ద పెద్ద బెంగలు...

అంతా నువ్వు సెకండ్ క్లాసు పూర్తి చేయటంతో మొదలైంది. ఇల్లు మారాం కాబట్టి దగ్గర్లో స్కూల్లో జాయిన్ చేద్దామని వెళ్లాం. ఇక్కడే అవంతి నగర్ తోట దగ్గర్లో ఉన్న స్కూలు. పేరు సంస్కార్ అట. అక్కడ వాళ్లు మూడో తరగతిలో చేర్చుకోవటానికి టెస్ట్ పెట్టారు. నువ్వు టెస్టు రాయలేకపోవటం అటుంచి కనీసం ఇంగ్లీషు పదాలు సులువైనవి కూడా చదవలేకపోయావు. ప్రిన్స్‌పల్ లోపలికి పిలిచింది. గంట సేపు ఆ అప్పాయింట్మెంట్ నడిచింది. అదంతా అయ్యేసరికి, మాకు నీ భవిష్యత్తు మీద పెద్ద బెంగపెట్టుకునేలా మాట్లాడింది ఆ ప్రిన్సిపల్. నువ్వు పన్లో పని నాన్న కంప్యూటర్ చూస్కుంటూ ఉంటాడు, నాతో టైమ్ గడపడని కంప్లయింట్ కూడా ఇచ్చావు. మొత్తానికి ఆ స్కూలువాళ్లు ఎక్కడో ఎసెస్మెంటుకి పంపారు. ఆ వాతావరణం చూడగానే, అది మానసికంగా సరిగా లేని పిల్లల కోసం పెట్టిన ఫెసిలిటీ అని అర్థమైంది. వాళ్లు కూడా టెస్టు పెట్టి నువ్వు చాలా వెనకబడి ఉన్నావని చెప్పారు. ఈ వెధవ స్కూలు వద్దని ఇంటికి ఇంకా దగ్గర్లో ఉన్న విజేత స్కూల్లో జాయిన్ చేద్దామని తీసుకెళ్తే అక్కడ కూడా వాళ్లు టెస్ట్ పెడతాం పాస్ అయితేనే తీసుకుంటాం అన్నారు. ఇప్పటికి నీ పరిస్థితి మాకు అర్థమైంది. ఆల్రెడీ ఒక మూడు నెలలుగా నీ పాత స్కూలు (కేసల్ టౌన్) టీచరు జయ మేడమ్ కూడా నీకు ఏం రావటం లేదని, నేర్పటం కష్టంగా ఉందని చెప్పింది. అందుకే టెస్టులో నువ్వెలాగూ పాసవ్వవని తెలిసి విజేత స్కూల్ కూడా వదిలేసుకున్నాం. మళ్లీ పాత స్కూల్లోనే, వాళ్లు ఒకవేళ మూడో తరగతి కష్టమని రెండో తరగతిలోనే వేసినా, చేర్చేద్దామని డిసైడ్ అయ్యాం. 

అయితే, నీకు రెగ్యులర్ టీచింగ్ మెథడ్ కష్టంగా ఉందని అర్థమై, నేనే కాస్త ఫోనెటిక్ అవేర్నెస్ మెథడ్ ప్రకారం, అంటే సౌండ్స్‌ని బట్టి పదాలు గుర్తుపట్టే పద్ధతి ప్రకారం, పాఠం చెప్పటం మొదలుపెట్టాను. రోజుకి రెండు గంటలు నేను ఒక క్లాసు, అమ్మ ఒక క్లాసు చెప్తున్నాం. ఇప్పటికి పది రోజులపైనే అయింది. మెల్లగా అందుకుంటున్నావన్న నమ్మకం వచ్చింది. 

అయితే నీకు శ్రద్ద ఉండదు. ఏకాగ్రత పెట్టవు. నీ వైపు నుంచి సాయం లేకుండా నేనే అంతా నీ మైండులో కూరిపెట్టాల్సి వచ్చినట్టు పాఠం చెప్పాల్సి వస్తుంది. అయినా ప్రయత్నిస్తున్నాను. ఇంకో రెండు మూడు నెలలైనా పాఠం చెప్పాలని ఉంది. నిన్ను మిగతా పిల్లలతో కలపాలని ఉంది. ఒక్కసారి నీకు చదవటం రాయటం వచ్చేస్తే, నువ్వు చాలామంది పిల్లల కంటే బ్రైట్‌గా ఉంటావని నా నమ్మకం. చూద్దాం. 

దీనంతటికీ నీ చిన్ని లైఫులో నువ్వు ఫేస్ చేసిన సమస్యలే కారణమని మాకు తెలుసు. కరోనా ఒక ఏడాదిపైనే స్కూల్లేకూండా చేసింది. లాస్ట్ ఇయరంతా అమ్మ అనారోగ్యం గురించి నీ చిన్ని మెదడులో నువ్వు కూడా టెన్షన్ పడ్డావని తెలుసు. జనవరిలో అయితే కొన్నాళ్లు నానీ దగ్గర నిన్ను వదిలి వచ్చాను.  ఇక నీ బక్కపల్చని ఆరోగ్యం, పుట్టినప్పటి నుంచి ఎదుర్కొంటున్న సమస్యలూ అన్నీ నిన్ను వెనక్కి లాగుతున్నాయని తెలుసు. చిన్ని చిన్ని నీ లైఫులో నువ్వూ ఈ నీ స్థాయికి మించిన బెంగలు పడుతున్నావు. స్కూల్లో నీ సిచ్యువేషన్ గురించి నువ్వు పైకి చెప్పకపోయినా ఆలోచిస్తుంటావని అప్పుడప్పుడూ నువ్వు మాట్లాడే మాటల్ని బట్టి అర్థమవుతుంది. ఏదేమైనా మనం కలిసి ఈ బెంగ దాటేస్తామనే అనుకుంటున్నాను. 

బుంగమ్మా.. లవ్యూ....

Phaneendra - the moviemaker & Sreemaan - the troublemaker/ Neanderthal.

Nowadays I am feeling like a big Pro in art. I am not lying- Out of 1-10 I am at level 6.  *** I have been playing this video game called Sp...