Friday, 8 September 2023

మా ముదుపుచ్చి.. తింగరబుచ్చి అన్నీ నువ్వే..

 నీ చిలిపితనం గురించి ఎంత చెప్పినా తక్కువే రా.. ఈమధ్య మాటలు బాగా నేర్చావ్.. ఒక్కోసారి కోపగించుకుంటావ్ కూడా.. నేను విసుక్కున్నా కూడా గమ్మునుంటావ్.. మరోసారి తిరగబడతావ్.. నువ్వు ఏది చేసినా అమ్మకు నాన్నకు ముద్దే.. నీతో సమయం, చేసే అల్లరి అన్నీ బావుంటాయ్. అమ్మగా కన్నా నీ దోస్తీని ఎక్కువగా ఇష్టపడతాను.


ఇద్దరం నాన్నకు తెలీకుండా చేసే పనుల్లో ఎంత రహస్యాన్ని మెంటెన్ చేస్తామంటే.. నువ్వు 007లా నాతో పాటు కూడా వచ్చేస్తావ్.. నాన్నగాడేమో  పాపం నిన్ను ఏం తెలీనోడివి అనుకుంటాడు కానీ.. ముది పుచ్చు అని తెలుసుకోడు.


ఎప్పుడో మన రహస్యాలు బయటపడిపోయి నిన్నూ నన్నూ తన్నినా ఆశ్చర్యం లేదు. చెప్పడం మరిచిపోయాను. నీకు తెలుగు నేర్పులేదని, నేర్పించలేకపోతున్నానని మీ నాన్న నన్ను దెప్పుతున్నాడు. నువ్వు చూస్తే ఇంకా తడుముకుంటూనే ఉంటావ్. నీ మాటలు తెలుగు కోసం పడే పాట్లు అవీ బావుంటాయ్.. చూడు ఎంత అందంగా మాట్లాడుతున్నావో..


నాకు ఇల్లుతుడిచి పెడుతున్నావ్ రోయ్.. ఈమధ్య నాకు నస ఎక్కువైందని చమత్కారాలు, చల్లోక్తులు విసురుతున్నావ్.. నా డ్రస్ లకు నా డాన్స్ కు వంకలు పెడుతున్నావ్... ఇవన్నీ దాటేసి మా ప్రేమ కథ గురించి తెగ ఆరాలు తీస్తున్నావ్.. పెద్దయ్యాకా అని నేను అనగానే బాబాయ్ ఉద్యోగం చేస్తాను. నీకు పెద్దగా బంగారం చీరలు కొంటాలే అని వాగ్దానాలు చేసేస్తావ్.. నాది, నాన్నది ప్రపంచం అంతా నీలోనే దాగుందని తెలుసుకుంటే చాలురా.. నువ్వు నీలా అందంగా, హృందాగా పెరిగితే అది చాలు. 


ఈ అమ్మ జీవితావికి చాలా మోసి అలసిపోయింది. నీ జీవితపు వెలుగులు చూసి తనువు చాలిస్తే చాలు. ఆ పరమేశ్వరుణ్ణి అదే కోరుకునేది. నాన్న, నువ్వు ఇద్దరే నాకు రెండు కళ్ళు. నాలుగో తరగతి తర్వాత నిన్ను స్కూల్ మార్పించాలనే ఆలోచన ఉంది. ఏమో ఎప్పటి మాటది. ప్రస్తుతం నీ నెత్తిన చాలా బరువే ఉంది. ఎలా దింపుకుంటావో ఏమో.. నాలుగో తరగతి తర్వాత ఆలోచిస్తాం ఏం చేయాలన్నది. 



No comments:

Post a Comment

Phaneendra - the moviemaker & Sreemaan - the troublemaker/ Neanderthal.

Nowadays I am feeling like a big Pro in art. I am not lying- Out of 1-10 I am at level 6.  *** I have been playing this video game called Sp...