Wednesday, 13 November 2024

ఎవడు వీడు

పుట్టినపుడు చేయంతలేడు.. ఇప్పుడో భుజాలకు అందుతూ ఏదో ప్రపంచ విజేతగా నాతో వాదులాడతాడు.

వీడితో లోకం మరింత బాధ్యతగా మారిపోయింది. అమ్మదనం కన్నా గొప్పది మరేదో వచ్చి చేరింది. నాన్నతనం కూడా అయుంటుంది. నీ ప్రతి వాదనా నాకు నచ్చుతుంది. నిర్మలం నీచూపు. పొగిడితే దిష్టి. నా బంగారు చిన్న స్కూలు కష్టాలు అయిపోయి హైస్కూల్ వరకూ వచ్చాడు. నెమ్మదిగా నడిచే నడకే అందులోనూ నీకంటూ ఓ స్టైల్ ఉంది. 11 ఏళ్ళు పూర్తి కాగానే నువ్వు ఓ హీరోగా నిలవాని చేసే ప్రయత్నం బావుంది. నీ సంగీతం, ఆర్ట్, వీడియోలు, నువ్వు ఇచ్చే ప్రసంగాలు ఎప్పుడూ నా పాల గుండెలను ఆప్యాయంగా తడుముకునేలా చేస్తాయి. మరకలతో నిండిన మనుషుల మధ్య ఈ తల్లి జీవితంలో నువ్వు నా కాంతిపుంజానివి. నాన్నా ఒకటి మాత్రం కోరుకుంటాను. మీ నాన్నలా నీతిగా,నిజాయితీగా నిలబడు, ఆడదాన్ని గౌరవంగా చూడు. పట్టుదల వదలకు,అప్పుడు ఎప్పటికీ విజయం నీ వాకిలి దాటిపోదు. చదువు అందరూ చదువుతారు, గెలుస్తారు కానీ అందులో నిజాయితీ ఉండకపోతే నీ గెలుపుకు అర్ధం ఉండదు. బంగారు తల్లి నీ పుట్టుక బెంగతో మొదలైంది.. నీ ఎదుగుదల ఆశతో చిగురులు వేస్తుంది. ముందు ముందు రోజులు ఎవరెస్ట్ అంత గౌరవమైన జీవనం,భవిష్యత్తు నీది కావాలని ఆశించే మీ అమ్మా నాన్నా❤️ నిండా నూరేళ్లు నాతండ్రికి💐

No comments:

Post a Comment

Phaneendra - the moviemaker & Sreemaan - the troublemaker/ Neanderthal.

Nowadays I am feeling like a big Pro in art. I am not lying- Out of 1-10 I am at level 6.  *** I have been playing this video game called Sp...